ముగిసిన షర్మిల సమావేశం..21న భారీ కాన్వాయ్‌తో..

*ముగిసిన షర్మిల సమావేశం..*

*21న భారీ కాన్వాయ్‌తో..*

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిళ సమావేశం నేడు ముగిసింది. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. పోడు భూముల అజెండాగా ఖమ్మంలో సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు. 21 న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు..