విద్యార్థులతో భేటీ అయిన వైఎస్ షర్మిల…

వరుస భేటీలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయురాలు వైఎస్ షర్మిల. తాజాగా నగరంలోని లోటస్‌పాండ్‌లో విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలుగు ప్రజలను రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని, డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దని ఆయన భావించారన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేదని, నేడు ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ఆమె అన్నారు. వాళ్లంతా ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్‌కు దక్కుతుందన్నారు. ఈ రోజు అందరికీ ఒక మంచి సమాజం కావాలని, తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అందరి నిరీక్షణ ఫలించాలంటే, ఒక మంచి సమాజం రావాలని అభిలషించారు..