లోటస్ పాండ్ లో ముగిసిన షర్మిల సమావేశం.. షర్మిల కీలక హామీ ఇదే..!!

హైదరాబాద్…

*🔹లోటస్ పాండ్ లో ముగిసిన షర్మిల సమావేశం…*

_• కాంగ్రెస్ లో పార్టీ విలీనం పై స్పష్టతనిచిన షర్మిల..

4న ఉదయం 11 గంటలకు రాహుల్, ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరతానన్న షర్మిల..

• ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవి చేపడతానాని సమావేశంలో చెప్పినట్లు సమాచారం..!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని.. ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు దక్కించుకోనున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె చేరికతోనే ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపును ఏపీ రాజకీయాల్లోనూ తీసుకుని రావాలని భావిస్తోంది. ఏపీలోనూ ఆ స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సత్తా ఒక్క వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉందని నమ్ముతోంది కాంగ్రెస్ అధిష్ఠానం. అందుకే కాంగ్రెస్ షర్మిలకు రెడ్ కార్పెట్ తో గ్రాండ్ వెల‌్‌కమ్ చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి…
మధ్య హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని YSRTP ఆఫీస్‌లో పార్టీ ముఖ్య సభ్యులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినప్పటికీ.. కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే తీర్మానంపై కూలంకషంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక లేదా విలీనానికి కొన్ని షరతులను పెట్టాలని వైఎస్ఆర్టీపీ భావిస్తోంది. గత ఏడాది చివర్లోనే వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వై.ఎస్. షర్మిల చర్చించారు. అయితే తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు వై.ఎస్. షర్మిల సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే మరోసారి వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ మరోసారి తెరమీదికి వచ్చింది. ఇవాళ హైద్రాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయమై ఆ పార్టీ నేతలతో వై.ఎస్. షర్మిల చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి వై.ఎస్. షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉంది..

ఈ నెల 4న షర్మిళ తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు ప్రకటించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ కీలక సమావేశానికి సంబంధించి వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అదేరోజున పార్టీ విలీనంతోపాటు షర్మిళ ఎంట్రీ కూడా ఉంటుందని అన్నారు!

ఈ క్రమంలో… షర్మిల గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు! ఈ సందర్భంగా ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని అన్నారు! ఈ సమయంలో… ఇంతకాలం తనను నమ్మి తనతోపాటు నడిచిన వైఎస్సార్టీపీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు!

మరోవైపు వైఎస్సార్టీపీ నేతలతో లోటస్ పాండ్ లో నిర్వహించిన కీలక భేటీ అనంతరం.. వైఎస్ షర్మిల ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం కోసం ఆమె వెళ్లనున్నారని తెలుస్తుంది. నూతన వధూవరులు రాజారెడ్డి, ప్రియతో కలిసి షర్మిల ఇడుపులపాయకు చేరుకుంటారని సమాచారం!