వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
పోలీసులకు హారితి ఇచ్చి.. ఇంటిబయటే బేటాయింపు..
ఈ క్రమంలో లోటస్ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది.
కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం,.
బీఆర్ఎస్ దాడులకు భయపడేది లేదని షర్మిల అన్నారు. పోలీసు బలగాలు తన పర్యటనను అడ్డుకోలేవన్పారు. ప్రాణాలు ఇచ్చైనా ప్రజల కోసం కొట్లాడతానని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం తేవాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్‌లోని జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అక్కడ పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. తీగుల్ గ్రామ ప్రజలు ఆందోళనలు చేపట్టారు..ఈనేపథ్యంలో వారిని కలిసేందుకు షర్మిల ప్లాన్ చేసుకున్నారు. దీంతో, పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు..