వైఎస్సార్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేసిన వైఎస్‌ షర్మిల..

*రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల*

*కాంగ్రెస్‌లో చేరిన వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల*

*ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల*

*వైఎస్సార్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేసిన వైఎస్‌ షర్మిల..

*భర్త అనిల్‌తో పాటు ఏఐసీసీ కార్యాలయానికి వైఎస్‌ షర్మిల*

*వైఎస్సార్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉంది..

*ఇవాళ్టి నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో ఒక భాగం: వైఎస్‌ షర్మిల..

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్, ఖర్గేసహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల కాంగ్రెస్ లో తాను చేరడంపై స్పందించారు…
వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, అందులోనే ఆయన అసువులుబాశారని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు..