కెసీఆర్ అధికారంలోకి రాక ముందు, ఇంటికో ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ అన్నారు ఎది..పాదయాత్ర లో వైఎస్ షర్మిల…

నల్గొండ…జిల్లా…

వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు ys షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర..

నల్గొండ జిల్లా,మర్రిగూడ
మండలం వట్టిపల్లి గ్రామానికి చేరుకున్నది..మునుగోడు నియోజకవర్గంలో 3 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతోంది.. ఇప్పటివరకు 17రోజులనుండి పాదయాత్ర చెయ్యగా అందులో భాగంగనే నేడు వట్టిపల్లి గ్రామానికీ చేరుకున్నారు… అందరితో కలిసి వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వంపై విమర్శలూ గుప్పిస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు.. బీమానపల్లి గ్రామము, మర్రిగూడ మండలం, వైయస్ షర్మిల గారు మాట ముచ్చట కార్యక్రమంని ఏర్పాటు షర్మిల చేసి ఆనంతరం మాట్లాడుతు…

సిఎం కెసీఆర్ అధికారంలోకి రాక ముందు, ఇంటికో ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ , KG to PG free education అన్నాడు, కానీ నేటికీ ఏడు సంత్సరాలుగా ఏ ఒక్క అమలు కాలేదు.

– వైయస్ఆర్ డ్వాక్రా మహిళలలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఒక సంవత్సరం పావలా వడ్డీని కూడా మాఫీ చేశారు. ఈ రోజు తీసుకుంటున్న రుణాలు ఇంటి కర్చులకు తీసుకుంటున్నారు.

– రుణాలు ఎన్ని ఏండ్లు కట్టినా తీరడం లేదని గ్రామాల్లో మహిళలలు చెబుతున్నారు.

– ఇప్పుడిస్తున్న రుణాలకు రూపాయి పావలా మిత్తి పడుతోంది. అది కూడా టైంకు కట్టాలి.

– వడ్డీలేకుండా రుణాలు కేసీఆర్ ఇస్తానన్నాడు. రూపాయి పావలా మిత్తి ఎందుకు పడుతోంది..?

మీరు పత్తి వేసుకుంటున్నారు కదా రాజశేఖర్ రెడ్డి హయాంలో పత్తి విత్తనాల ధర పదమూడు వందల రూపాయలు ధర ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లి ఆరు వందల రూపాయలకు తగ్గించారు..
అభయహస్తం ఎవరైతే కట్టారో ఆ కాగితాలను అట్లాగే ఉంచుకోండి.. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కొనసాగిస్తామని చెప్పారు అలాగే కరోనా వ్యాధి కోసం హాస్పిటల్ లో ఎవరైతే బిల్స్ ప్లే చేశారు ఆ బిల్లును కూడా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ చేస్తాది అని అన్నారు..పేద వాడి ఇంట్లో జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేసుకునేలా ఆరోగ్య శ్రీ ప్రవేశా పెట్టారు…Ysr హయాంలో మూడు సార్లు ఉద్యోగాలు వేసి లక్షలు ఉద్యోగాలు భర్తీ చేశారు.ఇదేనా బంగారు తెలంగాణ…వైస్సార్ నల్గొండ కు 30 సార్లు వచ్చాడు. అదే కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చాడో చెప్పండి…నాకు ఒక అవకాశం ఇవ్వండి…