షర్మిల వ్యాఖ్యలకు సీఎం జగన్ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్…

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకాస్త రంజుగా మారాయి. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలిరోజు నుండే షర్మిల తన సోదరుడు, సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించడంతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. ఈ క్రమంలో తన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యాఖ్యలకు సీఎం జగన్ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు.

ఇవాళ ఉరవకొండలో వైసీపీ నిర్వహించిన సభకు హాజరైన జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి తాజాగా చంద్రబాబు అభిమాన సంఘం చేరారని పరోక్షంగా షర్మిలపై విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో ఉండి టీడీపీ అధినేతకు చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాకీ పెట్టి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారని తనదైన స్టైల్లో జగన్ సెటైర్లు వేశారు. ఇక్కడ వీళ్లు ఎన్ని చేసిన.. వీళ్ల ఇల్లు, వాకిలి అంతా పక్క రాష్ట్రమేనని అన్నారు. కాగా, షర్మిల వ్యాఖ్యలకు జగన్ పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి అన్నా చెల్లెల విమర్శలు,సవాళ్లతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కువైంది..