వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు…

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.. ఈ కేసులో సీబీఐకి సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టారు.. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె..
నాన్న హత్యపై వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి చాలా తేలిగ్గా స్పందించారని పేర్కొన్నారు.. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని వాంగ్మూలం ఇచ్చిన ఆమె.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని పేర్కొన్నారు..నా తండ్రి హత్యను వైఎస్‌ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపారు సునీతారెడ్డి… సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారన్న ఆమె.. అవినాష్‌ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు..అవినాష్‌ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి వివరించిన ఆమె.. నా తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదు అని పేర్కొన్నారు.. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు సునీతారెడ్డి. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలంగా మారాయి.