సీఎం జగన్ ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది… వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!!.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది…. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడమే కాదు.. సంచలన విషయాలు ముందు పెడతాను అంటూ మీడియా ముందు ఎదో ఒక వ్యాఖ్యలు చేస్తున్నరు.. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు హద్దులు దాటుతున్నాయి. నువ్వొకటంటే నేను రెండు అంటాను అనే రేంజ్ లో తిట్ల దండకం కొనసాగుతోంది. తాజాగా ఓ వైసీపీ నేత సంచలన ఆరోపణలు చేశారు.. సీఎం జగన్ ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది అన్నారు….అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈ కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ను హత్య చేసి అయినా.. అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తోందన్నారు. అందుకు ఇటీవల వదర ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. సీఎం జగన్ గాల్లో వచ్చి.. గాల్లోనే కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని అప్పటి వ్యాఖ్యలు గుర్తు చేశారు. అంతేకాదు సీఎంను జైలుకు పంపేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు….