టిడిపి సభావేదిక కూలడం స్పందించిన వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి.

ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ సభలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తుండగా ఈదురుగాలులు వీయడంతో సభావేదిక కుప్పకూలింది. దాంతో చినరాజప్పతో పాటు వేదికపై ఉన్న చింతమనేని ప్రభాకర్ తదితర టీడీపీ నేతలు కిందపడిపోయారు.

దీనిపై వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి స్పందించారు. స్టేజి కూలడం బాధాకరమని పేర్కొన్నారు. వరుస అపశృతులు 2024 ఎన్నికల్లో విపక్షాల పతనానికి సంకేతాలా? అంటూ twitar వేదికగా ట్విట్ చేశారు..