కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే…. ఆన్ని చర్చలు జరిగినట్లేనా..!

వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి సమయం ఆసన్నమైందా..? అతి త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుందా..? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ కాబోతున్నారా..? రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే (New Delhi)పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నారా..? అంటే తాజా పరిస్థితులు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది..

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి నిర్ణయించుకున్నారు. జాతీయ పార్టీలో విలీనం చేసిన తర్వాత ప్రాంతీయ ప రాజకీయాల్లో ఉంటానని అనడం సాధ్యం కాదు.
పార్టీ అప్పచెప్పిన పని చేయాల్సిందే. ఇదే విషయాన్ని షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది…ఢిల్లీ పర్యటన, వరుస భేటీలు ఇవన్నీ రెండు మూడ్రోజుల్లో జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎలాంటి షరుతులు లేకుండా పార్టీని విలీనం చేయాలని.. తప్పకుండా సమయం వచ్చినప్పుడు పార్టీ నుంచి పదవులు.. అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యతే ఇస్తామని షర్మిలకు హామీ ఇవ్వబోతున్నారట…

కాంగ్రెస్‌లో విలీనం చేసేందేకు కర్ణాటక డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో (DK ShivaKumar) చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు బెంగుళూర్ పెద్దలతో భేటీ అయిన వైఎస్సార్టీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ నేత్రుత్వంలో ఢిల్లీ పెద్దలను కలువనున్న సమాచారం. ఈ క్రమంలో షర్మిల రెండు రోజుల పాటు హస్తినలోనే ఉంటారని, ఈ పర్యటనలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరితో భేటీ అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవబోతున్నారనీ, హస్తీన పర్యటన భేటీ వరుస భేటీలు ఇవన్నీ రెండు మూడ్రోజుల్లో జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.