వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు జమ

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది…ఎంత వడ్డీ అవుతుందో అంత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇదిలా ఉండగా, వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధితో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, రిలయెన్స్‌ రిటైల్, అమూల్, ఆజియో–రిలయెన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, మహేంద్ర అండ్‌ ఖేతి వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదర్చడంతో పాటు రుణాల కోసం బ్యాంకులను అనుసంధానం చేసింది..

వరుసగా మూడో ఏడాది 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి

నేడు ఒంగోలులో బటన్ నొక్కి వడ్డీ సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్‌

1,02,16,410 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.1261 కోట్లు

ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.3,615 కోట్లు చెల్లింపు

సున్నా వడ్డీ కింద చెల్లింపులు ఇలా…

2016-17
చెల్లించాల్సిన వడ్డీ రూ.980 కోట్లు
ప్రభుత్వం చెల్లించింది రూ.382 కోట్లు

2017-18
చెల్లించాల్సిన వడ్డీ
రూ.1,134 కోట్లు.
ప్రభుత్వం చెల్లించింది రూ. 0

2018-19
చెల్లించాల్సిన వడ్డీ రూ.1327 కోట్లు
ప్రభుత్వం చెల్లించింది రూ.0

2019-20
ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ
రూ.1258 కోట్లు, ప్రభుత్వం చెల్లించింది రూ.1258 కోట్లు

2020-21
ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ
రూ.1,096 కోట్లు, ప్రభుత్వం చెల్లించింది రూ.1,096 కోట్లు

2021-22
ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రూ.1261 కోట్లు. ప్రభుత్వం చెల్లించింది రూ.1261 కోట్లు