సినీ నటి శ్రీరాపాక YSRCP నుంచి పోటీ ..!!!

సినీనటి శ్రీ రాపాక(Actress Sri Rapaka) రాజకీయాల్లోకి(Politics) రావాలనుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో(YSRCP) చేరారు. ముఖ్యమంత్ర జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఆశీర్వదిస్తే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) బరిలో దిగుతానని చెప్పారు..

సినీ నటి శ్రీరాపాక YSRCP నుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమ గోదావరి గోపాలపురం నుంచి ఆమెకు టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాషన్ డిజైనర్‌గా శ్రీపాక తెలుగు, తమిళం, మలయాళంలో పెద్ద సినిమాలకు పనిచేసారు..నేకెడ్, నేకెడ్ ది లస్ట్ వంటి సినిమాల్లో కూడా నటించారు. కానీ ఆమెకు నటిగా అవకాశాలు రాలేదు. దాంతో తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే దృష్టిపెట్టారు. పూరీ జగన్నాథ్ , కృష్ణవంశీ తీసిన సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసారు……

అవకాశం ఇస్తే వైసిపి తరఫునుండి పోటీ చేస్తా..

స్వతహాగా క్రీడాకారిణినని, ఖో ఖో, కబడ్డీ, బాస్కెట్ బాల్ పోటీల్లో జాతీయస్థాయి వరకు వెళ్లానని శ్రీ రాపాక వెల్లడించారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లానని, సినిమా రంగంలో ప్రవేశించానని వెల్లడించారు.

ఇవాళ గుడికి వచ్చి జగన్ గారు మళ్లీ సీఎం కావాలని దేవుడ్ని కోరుకున్నానని శ్రీ రాపాక తెలిపారు. జగన్ గారు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో గోపాలపురం (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా) నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని మనసులో మాట వెల్లడించారు.

తాను కూడా అక్కడక్కడా ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నానని, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ గారు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకే తాను కూడా ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.