వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం..!.జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ..!!

వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం వెళ్లునున్నారట. ఇక కాసేపట్లో కిర్లంపూడి ముద్రగడ నివాసానికి వైసిపి నేతలు వెళ్లనున్నారు..అటు ముద్రగడ నివాసానికి ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. ముద్రగడ తో వైసీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు మిధున్ రెడ్డి, బోస్ సమావేశం కానున్నారు. అలాగే.. ముద్రగడ ఇంటికి వైసీపీ జిల్లా కాపు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రానున్నారు.

ఈ సందర్భంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనుంది వైసీపీ బృందం. ప్రస్తుతానికి షరతులు లేకుండానే వైసీపీలోకి ముద్రగడ వెళ్లనున్నారట. అవకాశం, అవసరాన్ని బట్టి పిఠాపురం స్థానం పరిశీలించే యోచనలో అధికార పార్టీ ఉంది. అలాగే..ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి హామీ ఇచ్చిందట వైసీపీ. ఇక వచ్చే వారంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో ముద్రగడ పద్మనాభం కుటుంబం చేరనుందట…జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై ముద్రగడను పోటీలో నిలిపేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, గాజువాకలో కూడా పవన్ మరోసారి రీసర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సీటుపై క్లారిటీ లేక అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను కూడా అధికార పార్టీలో కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు వర్మకు టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. అయితే, నాది గెలిచే సీటు.. నాకు చంద్రబాబు నాయుడు కచ్చితంగా అవకాశం ఇస్తారని వర్మ అధికార పార్టీ పెద్దలకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.