కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్
పాలేరు నుండి షర్మిల పోటీకి సిద్దం…
దాదాపు 4-5 నెలలుగా ఊరిస్తున్న అంశానికి తెరపడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల పార్టీ విలీనం అంశం ఇక లేనట్టేనని సమాచారం. షర్మిల విధించిన డెడ్‌లైన్ ముగిసినా కాంగ్రెస్ స్పందించకపోవడంతో ఒంటరిగానే బరిలో దిగాలని షర్మిల నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.
.. విలీనమే కాదు ఎలాంటి పొత్తులు కూడా లేకుండా వైఎస్సార్టీపీ బరిలోకి దిగబోతోందన్న మాట. అంతేకాదు.. అక్టోబర్-09 నుంచి పార్టీ బీ-ఫామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కూడా అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఇందుకు సంబంధించి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీచేయడానికి షర్మిల సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. ఇక కాంగ్రెస్ మాటే ఎత్తకూడదని ఇంత జరిగిన తర్వాత విలీనం అనే ఊసే రాకూడదని షర్మిల భావిస్తున్నట్లు తెలియవచ్చింది..
కారణం ఇదీ..!!
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన షర్మిల. కాంగ్రెస్ పార్టీతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిల రెడీ. ముందు నుంచి షర్మిల రాకను వ్యతిరేకిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
షర్మిల పార్టీ నుండి పోటీ కోసం రెండు మూడు రోజుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం.
షర్మిల కీలక ప్రెస్‌మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారట. మరి ఈ మీడియా సమావేశంతో అయినా విలీనానికి ఎందుకు బ్రేక్ పడింది..? అనే విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి…