వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు….

R9TELUGUNEWS.COM.: కొన్ని రోజుల నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీ ఈసీ అనుమతి ఉంటుందా లేదా ఆందోళన చెందిన ఆ పార్టీ నేతలకు అభిమానులకి ఓ శుభవార్త అందింది… అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా)కి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిందని ఆ పార్టీ ప్రకటించింది. ఈసీ గుర్తింపు పత్రం జారీ చేయడంతో బుధవారం వైఎస్‌ షర్మిల కేక్‌ కట్‌ చేశారు. వైఎస్‌ విజయమ్మ, బ్రదర్‌ అనిల్‌కుమార్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ కాకుండా పలువురు ప్రయత్నాలు చేశారని.. అయినా రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా గుర్తింపు సాధించుకున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాయిదా పడిన వైఎస్‌ షర్మిల పాదయాత్రను పది రోజుల్లో తిరిగి ప్రారంభిస్తారని పార్టీ సీనియర్‌ నేత తూడి దేవేందర్‌రెడ్డి తెలిపేరు…