ప్రపంచాన్ని భయపెడుతున్న జాంబీ వైరస్‌… వేగంగా కరుగుతున్న మంచు.జాంబీ వైరస్‌లు విజృంభిస్తే కరోనా కంటే పెద్ద ప్రమాదం..

మనుషులు రాక్షసుల్లా మారిపోతారు! కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు! విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్‌ సినిమాల్లో చూస్తున్న జాంబీ వైరస్‌ కథ ఇదీ! నిన్నటిదాకా ఫిక్షనల్‌ స్టోరీగా ఉన్న ఈ వైరస్‌.. తొందరలోనే నిజం కాబోతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు…
48 వేల సంవత్సరాలుగా ఆర్కిటిక్ మంచు కింద కప్పబడిన జాంబీ వైరస్ ఇప్పుడు బయటకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ పరిశోధకులు. ఈ జాంబీ వైరస్ బయటకు వస్తే.. పోలియో తరహాలో జనం అనారోగ్యం బారిన పడతారని.. మానవాళికి ముప్పు తప్పదని గట్టిగానే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వేల ఏండ్లుగా మంచులో కప్పబడిన ఈ వైరస్‌లు‌.. ఇప్పుడు బయటకు వస్తుందన్న అంచనాతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. కరోనా వైరస్‌ సృష్టించిన విలయతాండవం నుంచి ఇంకా బయటపడకముందే.. అంతకుమించిన ప్రమాదకరమైన వైరస్‌లు మనుషులపైకి దండయాత్ర చేసేందుకు వస్తుందన్న విషయం తెలిసి బెంబేలెత్తిపోతున్నారు…

ఆర్కిటిక్ మంచు ఖండం వేగంగా కరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగి..అందులోని వైరస్ లు బయటపడుతున్నాయి. దీంతో.. మంచులో వేల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన వైరస్‌లు ఇప్పుడు బయటకు వస్తున్నాయంట.. మంచు కరిగి, ఆ నీళ్లలోని వైరస్.. ఇతర ప్రాంతాలకు చేరుతుంది. అలా జాంబీ వైరస్ ముప్పు ఉంటుందని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని వైరస్‌లు వేల సంవత్సరాలు మంచులో గడ్డకట్టి సజీవంగానే ఉంటాయంట..అందులో జాంబీ తరహా వైరస్‌లు 48 వేల 500 సంవత్సరాలు మంచులో సజీవంగా ఉంటాయంట.. ఇప్పుడు ఆ మంచు కరిగి.. నీళ్లుగా మారి.. ఆ నీళ్ల ద్వారా వైరస్ జనంలోకి వచ్చేస్తుంది అనేది ఇప్పుడు భయపెడుతున్న అంశం. మంచు కరగటం ద్వారా బయటకు వచ్చే వైరస్.. వాతావరణంలో కలిసి.. గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంట.. ఈ జాంబీ వైరస్‌లు విజృంభిస్తే కరోనా కంటే పెద్ద ప్రమాదం వస్తుంది…సైబీరియన్‌ ఏరియాలోని కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులకు.. ఈ వైరస్‌ వేల ఏళ్ల నుంచి మంచులో ఉండిపోయినట్లు తెలిసింది. ఇప్పుడు మంచు కరిగి.. అవి బయటికి వస్తే.. భారీ ప్రమాదమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి ప్రపంచానికి దక్షిణ ప్రాంతాల్లో మొదలై.. ఉత్తరానికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఎయిక్స్ మార్సిల్లే యూనివర్సిటీ పరిశోధకులు. ఈ వైరస్ వల్ల పోలియో వంటి వ్యాధులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబీరియా ప్రాంతంలో ట్రాఫిక్‌ పెరగడం, ఆయిల్‌ వెలికితీయడం, పారిశ్రామిక అభివృద్ధిలాంటి కారణాలతో… ఆర్కిటిక్‌ మహాసముద్రంలో మంచు వేగంగా కరుగుతుంది..మంచు ఖండంలోని ఇంధన నిక్షేపాల కోసం.. వేల అడుగుల లోతుకు డ్రిల్లింగ్ చేస్తున్నారని.. దీని వల్ల కూడా జాంబీ వైరస్ లు బయటకు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఏదిఏమైనా మనోళ్లు వినటం అనేది ఎప్పుడో మానేశారు.. జాంజీ వైరస్ మన ఇళ్ల వరకు వచ్చే వరకు కళ్లు తెరవటం అయితే సాధ్యం కాదు అనేది జనం భావన.. ఎందుకంటే ప్లాస్టిక్ విషయంలోనూ.. కరోనా విషయంలో ఇదే చూశారు కదా జనం…