కారుపై కూర్చొని మద్యం తాగుతూ హల్‌చల్ ..

కారుపై కూర్చొని మద్యం తాగుతూ హల్‌చల్ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో కారుపై కూర్చొని మద్యం తాగుతూ వెళ్తున్న యువతి వీడియోను డాష్‌క్యామ్ ద్వారా రికార్డు చేసిన మరో యువతి వాహనం.. ఎంజాయ్ పేరుతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల భద్రతను సైతం ముప్పులో పడేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుర్కయాంజాల్‌లో ఇటువంటి దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. తుర్కయాంజల్ ప్రధాన రహదారిపై కదులుతున్న కారు టాప్ పై కూర్చున్న ఓ యువతి హల్ చల్ చేసింది. ఓ చేత్తో బీర్ బాటిల్ పట్టికుని కారు వెళ్తుండగానే బీర్ తాగుతూ కనిపించింది. రహదారిపై ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ఏమాత్రం భయం లేకుండా ఆమె చేసిన ఈ పనిని చూసి వెనుక వస్తున్న వాహనదారులు షాక్‌కు గురయ్యారు…

మరో వాహనదారుడు డాష్‌ క్యామ్ ద్వారా ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. ఓ యువతి ఏ మాత్రం భయం లేకుండా కారుపై కూర్చొని మద్యం తాగుతూ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కారు పక్కనే ఆర్‌టీసీ కూడా వెళ్తుండటం వీడియోలో చూడొచ్చు.
https://x.com/TeluguScribe/status/2111362911549653050?s=20