తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…కొప్పుల సైదిరెడ్డి.

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక.. బతుకమ్మ సంబరాలు.m

హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని వేపల సింగారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలకు ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసి డా.కొప్పుల సైదిరెడ్డి..

ఈ సందర్భంగా కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదు అని, తెలంగాణ ఆడబిడ్డల జీవన సంస్కృతికి ప్రతిభింబం బతుకమ్మ పండుగ అన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి చిహ్నం! తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, ఐకమత్యానికి మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ, ఆటపాటలతో ఆనందంగా సంబరాలు జరుపుకోవడం తెలంగాణ ప్రజల జీవన విధానంలోని ప్రత్యేకతను చాటి చెబుతుందని అన్నారు..వేపలసింగారం (మిట్టగూడెం) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నె ముద్దల బతుకమ్మ వేడుకల్లో మాజీ సర్పంచ్ శ్రీమతి అన్నెం శిరీష కొండారెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె నాగిరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ రెక్కల శంబిరెడ్డి మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు నంది రెడ్డి సైదిరెడ్డి మండల నాయకులు సారెడ్డి భాస్కర్ రెడ్డి గోపిరెడ్డి రాజమోహన్ రెడ్డి కుందూరు కోటిరెడ్డి గోపిరెడ్డి బ్రహ్మారెడ్డి సామల బ్రహ్మారెడ్డి వార్డు మెంబర్ లు కలకొండ లక్ష్మీ, చెదపంగు జోజి, ఉల్లిందల వీరయ్య, నాయకులు చడపంగు వెంకటేశ్వర్లు, వీరమల్ల సుందరయ్య,ఆదూరి నాగేష్ షేక్ మదార్, కుందూరు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి జోజిరెడ్డి, సారెడ్డి మోహన్ రెడ్డి భూపాల్ రెడ్డి , కర్ణ వెంకటరెడ్డి, బూసిపల్లి బిక్ష్మారెడ్డి కర్నాటి శ్రీనివాసరెడ్డి రేగళ్ల శ్రీనివాస్ తలపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,పులిచర్ల బ్రహ్మారెడ్డి, గోపిరెడ్డి బిక్షమరెడ్డి కదిర శ్రీనివాస్ రెడ్డి మహిళ నాయకులు చంద్రకళ హరిలీల శోభ కనకమ్మ పద్మ కుమారి నాగమణి తదితరులు పాల్గొన్నారు.