జమ్మూకశ్మీర్లో సంచలన ఘటన వెలుగులోకి..చైనా గూఢచార సంస్థలకు సున్నితమైన విషయాలను పంచుకున్న తెలుగు మహిళ..
జమ్మూకశ్మీర్లో సంచలన ఘటన వెలుగు చూసింది. చైనా గూఢచార సంస్థలకు చెందిన ఏజంట్లతో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను పంచుకున్న తెలుగు మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఒక సీనియర్ ఆర్మీ అధికారి భార్యగా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు…మరోవైపు సదరు మహిళ రహస్యంగా సున్నితమైన పత్రాలు, ఫోటోలు, ఎలక్ట్రానిక్ డేటాను సేకరించి విదేశీ గూఢచారులకు చేరవేసింది. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా ఈ సమాచారం చైనా తదితర విదేశీ శక్తులకు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎంత సమాచారం బయటకు వెళ్లింది? విదేశీ గూఢచారులతో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడ్డాయి? అనే కోణంలో దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటంతో పోలీసులు పూర్తి వివరాలను ఇంకా గోప్యంగా ఉంచారు.