లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*కార్తీక మాసం ఎఫెక్ట్…తిరుమలకు పోటెత్తిన భక్తులు..*

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గతవా కార్తికమాసం సందర్భంగా తిరుమలలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.ఆదివారం కావడంతో తిరుమలకు పోటెత్తారు.ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు.దీంతో టోకెన్ లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 18 గంటల సమయం పడుతోంది.ఇక శనివారం 88,076 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 33,236మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.కాగా నవంబర్ 5న నాగులచవితి సందర్భంగా శ్రీవారికి పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు.8న పుష్పయాగానికి అంకురార్పణ 9న మలయప్పస్వామికి పుష్పార్చన జరగనుంది.ఈనెల 13న సూర్యోదయానికి ముందు తిరుమాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగనున్నారు. 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడు వాహనంపై శ్రీవారి దర్శనం ఇవ్వనున్నారు..

యోగి ఆదిత్యనాథ్ ను సంపేస్తామంటూ మెసేజ్*???

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చంపేస్తామంటూ ముంబాయి పోలీసులకు దుండగులు మెసేజ్ పంపారు ఆయన రాజీనామా చేయకుంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బావ సిద్దిఖిని చంపినట్లే యోగిని కూడా హతం చేస్తామని మెసేజ్ ఉందని

మెసేజ్ ఎవరు పంపారు తెలుసుకోవడానికి పోలీసులు విచారిస్తున్నామని తెలిపారు..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బిజెపి మేనిఫెస్టో విడుదల

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా.. ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోంది.. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది.. సోరెన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదు.. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి.. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉంది.. బీజేపీ అధికారంలోకి వస్తే వలసదారులు ఆక్రమించిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం అన్నారు..

*అయప్ప భక్తులకు గుడ్ న్యూస్*

అయ్యప్ప భక్తులకు కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తింపజేయనుంది.సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం
తీసుకున్నారు. ఆలయానికి వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులే ఏర్పాట్లు చేయనున్నారు.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పెషల్ బీమాకవరేజీ పథకానికి ప్రీమియం చెల్లించనుంది…

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో శనివారం దాకా హెచ్చుతగ్గులు ఉన్నా బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 73,700 ఉండగా.. 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 80,400 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర 1,00,600 గా కొనసాగుతుంది…

అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

అసదుద్దీన్ ఒవైసీని ముస్లిం సోదరులే పట్టించుకోరు.. ఆయన గురించి మాట్లాడి వేస్ట్.

ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు.

మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది మేమే.. అని కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ చెప్పాడు, ఇందులో కొత్తగా అసద్దూదిన్ కనిపెట్టింది ఏంది? మేము చెప్పిన బడ్జెట్‌లోనే పూర్తి చేసే సత్తా మాకుంది – ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

ఈ నెల 7 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు: IMD

Nov 03, 2024,

ఈ నెల 7 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు: IMD..

తెలుగు రాష్ట్రాలలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 7 నుంచి 11 వరకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

NTR, CBN, KCRకు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం: రాజయ్య..

ఎన్టీఆర్, చంద్రబాబు, KCRకు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం శ్రీహరి అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. ‘పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి. నమ్మకద్రోహి, జిత్తులమారి నక్కగా పేరున్న కడియం, KTRపై మాట్లాడడం సిగ్గు చేటు. KTRపై కడియం నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నా. పార్టీలు మారడంలో కడియం మెరుపు వీరుడు, హైట్రిక్ సాధించాడు’ అని ఎద్దేవా చేశారు…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దంటూ ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలు..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దంటూ ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను అనకాపల్లి(D)లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు <<14521702>>ప్రకటన<<>> కలవరపెడుతోంది. దీని ప్రభావం విశాఖ ఉక్కుపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రైవేట్ ప్లాంట్ తేవడం వెనుక దురుద్దేశం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. అయితే విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధితో ఉన్నామని ప్రభుత్వం అంటోంది…

పుష్ప-2’.స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉంది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుందని, కేవలం స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో శ్రద్ధా కపూర్‌తో పాటు శ్రీలీల కూడా కనిపించనున్నారని, ఈ వారంలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.

విజయవాడ -హైదరాబాద్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..!

..యాదాద్రి భువనగిరి జిల్లా
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనల రద్దీ కొనసాగుతున్నది.దీపావళి పండుగ ముగియడంతో పల్లెల నుండి పట్నం బాట పట్టిన వాహనదారులు.. దీపావళి పండుగ సందర్భంగా సెలవు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణం కావడంతో పంతంగి టోల్ ప్లాజా భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.
సెలవులు ముగియడంతో పట్నం బాట పట్టిన వాహనదారులతో విజయవాడ -హైదరాబాద్ హైవే పై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది..

కన్నడ నటుడు డైరెక్టర్ గురు ప్రసాద్ ఆత్మహత్య.

కన్నడ నటుడు, డైరెక్టర్ గురుప్రసాద్(52) ఆత్మహత్య
తన నివాసంలో ఉరి వేసుకుని గురుప్రసాద్ సూసైడ్
ఆర్థిక సమస్యలే కారణమని పోలీసుల అనుమానం..

వైసీపీ ఎంపీ విజయసాయి కీలకవ్యాఖ్యలు
2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి…విజయసాయిరెడ్డి..!

చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి కీలకవ్యాఖ్యలు
2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి…విజయసాయిరెడ్డి.
ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి అన్నారు ..కార్యకర్తలను విస్మరించామన్న అపవాదు తొలగిపోవాలి
కార్యకర్తలను ప్రాణంగా చూసుకోవాల్సిన బాధ్యత నేతలదే
చిత్తూరులోని 14 నియోజకవర్గాల గెలుపు బాధ్యత భూమనదే అన్నారు..

*ఎక్కువ మంది సంతానం ఉండాలన్న సీఎం చంద్రబాబు నాయుడు మాటలు కరెక్టే..అసదుద్దీన్ ఒవైసీ..

జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది.

దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉంది.. ఎక్కువ సంతానం కలగాలని చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారు.

ఇదే మాట నేనంటే రాద్ధాంతం చేస్తారు..

6న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట: ఈ నెల 6న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు సమాచారం. సీఎం 6వ తేదీన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆదివారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని అధికారులను ఆదేశించారు.

జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి (వీడియో)

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. ప్రధాన శ్రీనగర్‌లోని టీఆర్‌సీ కార్యాలయం సమీపంలోని ఆదివారం మార్కెట్‌లో ఆదివారం గ్రనేడ్ దాడి జరిగింది. మార్కెట్‌లో ఉన్న జనం ఈ పేలుడులో 10 మంది గాయపడినట్లు సమాచారం. ఒక రోజు ముందు ఖన్యార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి.