టర్కీ కి మరో భారీ షాక్ ఇచ్చిన భారత్..!

టర్కీ కి మరో భారీ షాక్ ఇచ్చిన భారత్…

టర్కీ సంస్థ సెలిభి కి ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు

దేశంలోని విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న టర్కీ కి చెందిన సెలిబి కంపెనీ

జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్న కేంద్రం

గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ నిర్వాణ కోసం గతంలో ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్ ఎత్తివేసిన భారత బ్యూరో సివిల్ ఏవియేషన్..

దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసులు అందిస్తున్న సెలిభి సంస్థ..

గతంలో ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ ఎగుమతి కేంద్రంగా పేరొందిన ఉదయ్‌పూర్‌లో “మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ” ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కమిటీ అధ్యక్షుడు కపిల్ సురానా మాట్లాడుతూ, “టర్కీ పాక్‌కు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ, టర్కీతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది,” అని తెలిపారు. ప్రస్తుతం దేశానికి దిగుమతయ్యే మార్బుల్‌లో 70 శాతం టర్కీ నుంచే వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మార్బుల్ వ్యాపారులకు మార్గదర్శకంగా నిలవాలని, టర్కీపై వాణిజ్యంగా ఒత్తిడి తెచ్చేలా అన్ని రాష్ట్రాల్లోని మార్బుల్ సంఘాలు ఇదే బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. “ఇది కేవలం వ్యాపార నిర్ణయం కాదు… దేశ భద్రత పట్ల, ప్రభుత్వం పట్ల మేము కట్టుబాటుగా ఉన్నామన్న సంకేతం,” అని సురానా స్పష్టం చేశారు.

వాణిజ్యం నిలిపివేతతో దేశీయ మార్బుల్ పరిశ్రమకు గణనీయమైన లాభాలు చేకూరతాయని, డిమాండ్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ‘బాయ్‌కాట్ టర్కీ’ పిలుపు ఇతర రంగాలకు విస్తరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షరీఫ్‌తో భేటీ కావడం, టర్కీ డ్రోన్లు పాక్‌కు సాయం చేసినట్టు పలు సమాచారం వెలుగులోకి రావడం, భారత్ కూల్చిన డ్రోన్లలో టర్కీ తయారీ ‘అసిస్ గార్డ్ సోంగర్’ భాగాలు కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో టర్కీపై వ్యాపార బహిష్కారం దేశప్రజల భావోద్వేగానికి ప్రతినిధిగా మారుతోంది..