ఢిల్లీ: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం
గోదావరి పుష్కరాలకు నిధులివ్వాలని కోరిన చంద్రబాబు
దక్షిణాదిలో నదుల అనుసంధానంపై చర్చ..
గోదావరి పుష్కరాలు మరియు నదుల అనుసంధానమే లక్ష్యం
ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి పలు విజ్ఞప్తులు అందజేశారు. ముఖ్యంగా రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, అలాగే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా దక్షిణాది నదుల అనుసంధాన ప్రాజెక్టును త్వరగా చేపట్టాలని ప్రధానిని కోరినట్లు సమాచారం.
Chandrababu Naidu: కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
కేవలం ప్రధానితో మాత్రమే కాకుండా, సీఎం చంద్రబాబు తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ మరియు సీఆర్ పాటిల్లను కూడా ప్రత్యేకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం తరఫు నుంచి పూర్తి సహకారం అందించాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు.