తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ లో ఈదురు గాలుల బీభత్సం..!

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలియజేసింది.అంతేకాదు తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. దీంతో వేడితో అల్లాడుతున్న ప్రజలు కాస్తంత సేద తీరే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు పెద్ద ఎత్తున వీచాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.