27 రోజుల పాటు గోంచా ఉత్సవాలు..స్పెషల్’ యాత్ర..!

దేశవ్యాప్తంగా జరిగే పండగల్లోకల్లా ఛత్తీస్గఢ్ లోని బస్తర్లో జరిగే ‘గోంచా’ పండగ అతి ప్రాచీనమైనది. ఇందులో భాగంగా జరిగే ఉత్సవాలు కళా సంస్కృతికి, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి. దసరా తర్వాత చాలా రోజులు పాటు నిర్వహించే అతి ముఖ్యమైన పండగల్లో కెల్లా గోంచా ఒకటి. ఆషాడ మాసంలో జరుపుకునే ఈ వేడుకల్లో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇందులో గిరిజనుల ఆచార సాంప్రదాయలను చూడటానికి జనం సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు..27 రోజుల పాటు గోంచా ఉత్సవాలు
బస్తర్లో శుక్రవారం గోంచా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బస్తర్ రాజవంశీయుల్లో ఒకరైన కమల్ చంద్ బాంజ్దేవ్ ‘గోంచా’ గురించి వివరించారు. ఇది రాజుల కాలం నాటి పండగని, పూరీలో గజపతి మహరాజ్ స్వయంగా చేరి దీన్ని పూర్తి చేస్తారన్నారు. గోండి తెగలు సుమారు 600 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు. దీన్ని 27 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక్కడ ఉండే బంగారు చీపురును భగవంతుడి చీపురుగా కొలుస్తారు. పూరి జగన్నాథ రథయాత్ర మాదిరిగా సుభద్ర, బలభద్ర, జగన్నాథలను రథాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జరుపుకునే తుపాకుల ఆటలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వీటిని వెదురుతో తయారు చేసి వాటిలో బుల్లెట్లుగా మల్కాంగిని పండ్లను ఉపయోగిస్తారు…

మహా హారతి
ఇందుకు సంబంధించి అరణ్యక్ బ్రాహ్మణ సమాజ్ సభ్యురాలు దీప్తి పాండే కొన్ని విషయాలను పంచుకున్నారు. ఊరేగింపులో భాగంగా విగ్రహాలను రథంపై అత్తగారింటికి (జనక్పురి)కి తీసుకువెళ్తారు. ఈ విగ్రహాన్ని జనక్‌పురి నగరంలోని సిర్హాసర్ భవన్‌లో నిర్మించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే మహా హారతి బహుదా గోంచా వరకు జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి ఈ సంప్రదాయాలను తిలకిస్తుంటారు. ఈ విధంగా 360 మంది అరణ్యక్ బ్రాహ్మణ సమాజం, స్థానికంగా ఉన్న మాంఝీ, చలాకీ, గిరిజన సమాజం ఈ ఉత్సవాల్లో పాల్గొని ఘనంగా వేడుకలు జరుపుకుంటారు..