50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే…

సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గలేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను గుర్తుకు తెస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదన్నాడు. అందుకే పెళ్లి చేసుకోకుండా బ్రేకప్ చెప్పాను. చాలా మంది నాకు ప్రపోజల్స్ చేసిన సినిమాలు మానేయాలని కండిషన్లు పెట్టారు. అందుకే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. సినిమాల్లో బిజీ అయ్యాక అసలు పెళ్లి గురించి మర్చిపోయాను అంటూ అమీషా.. కానీ కరెక్ట్ అబ్బాయి దొరికినప్పుడు దాని గురించి ఆలోచిస్తా అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో షాక్ అవుతున్నాయి. చిన్న వాళ్లతో కూడా డేటింగ్ చేస్తా అనడంతో.. మేం రెడీ అంటూ కొందరు నెటిజన్లు ఆమెకు రిప్లై ఇస్తున్నారు. ఈ బ్యూటీ రీసెంట్ గా సన్నీడియోల్ తో చేసిన సినిమాతో మంచి హిట్ అందుకుంది. తెలుగులో పవన్ తో బద్రి, మహేశ్ బాబుతో నాని సినిమాల్లో నటించింది..