కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ‘యంగ్ ఇండియన్’ కంపెనీ నిధుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రస్తావించిన విషయంపై ఆయన మాట్లాడారు. అనంతరం కవిత ఇష్యూపై కూడా పరోక్షంగా కీలక కామెంట్స్ చేశారు.

తమది ప్రజాస్వామ్య పార్టీ అని.. పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా.. ఏ రూపంలోనైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని చెప్పారు. అదే సమయంలో కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటనే బాగుంటుందని ఇది అందరకీ వర్తిస్తుందని అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు మేం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టాం. వేల మంది కార్యకర్తలతో కూర్చుని గంటల కొద్దీ చర్చించాం. ఆ ప్రాసెస్‌లో చాలా మంది డైరెక్టుగా మైకులో మాట్లాడారు. కొందరు చిట్టీల రూపంలో రాసిచ్చారు. కేసీఆర్‌కు ఉత్తరాలు ఇచ్చినవారు కూడా ఉన్నారు. మా పార్టీలో ఓపెన్ కల్చర్ ఉంటుంది. మా పార్టీలో డెమక్రసీ ఉంది.