Live Update News..
రేపటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ: సీఎం రేవంత్
ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద మ. 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి రెండు విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
*రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ రాజేష్.!!*
మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ రాజేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
ఏసీబీ అధికారుల నుండి తప్పించుకుని పారిపోతున్న రాజేష్‌ను, చేజ్ చేసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్న అధికారులు..
ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న గ్రామ ప్రజలు..!
సౌదీ బస్సు ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలకు చెందిన వారు మృతి.
సౌదీ బస్సు ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలకు చెందిన 15 మంది మృతి.. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు మృతి.. ప్రాణాలతో బయటపడిన షోయాబ్ అనే యువకుడు..
సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల చాలా నష్టం .సీపీ సజ్జనార్.
సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల చాలా నష్టం జరిగింది.. పైరసీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది.. పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశాం.. ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం.. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించాం.. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం-
మంది రవిది విశాఖపట్నం.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు.. పాన్‌కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉంది.. రవికి ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్ లాంటి ఎన్నో దేశాలు తిరిగాడు.. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు.. టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమా అప్లోడ్ చేశాడు.. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశాడు.. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు.
రవి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో చాలా మంది నష్టపోయారు.. రవి హార్డ్ డిస్కులో అన్ని సినిమాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడు.. రవి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.. 50 లక్షల మంది డేటా రవి దగ్గర ఉంది.. ఈ డేటాను మిస్యూజ్ చేసే అవకాశం ఉంది.. దీని వెనుక పెద్ద రాకెట్ ఉంది అని సీపీ సజ్జనార్..
దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరాడు.. ఇమంది రవి ఇప్పుడెక్కడున్నాడు..? హైదరాబాద్ పోలీసులను అంత తక్కువగా అంచనా వేయొద్దు.. పోలీసులను, ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు.. ప్రజలు ఇలాంటి సైట్ల జోలికి పోవద్దు.. సపోర్ట్ చేయొద్దు.. మీకు నష్టం జరుగుతుంది-సీపీ సజ్జనార్
అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్టుకు గురయ్యారు.. పోలీసులకు సమాచారం ఇచ్చాం.. ఉచితంగా సినిమా చూస్తున్నామని మాత్రం అనుకోకండి.. మీ డేటా చోరీ అవుతుందనేది గుర్తుంచుకోండి.. మేం చేయలేని పని.. తెలంగాణ పోలీసులు చేశారు-నాగార్జున
ఎంతోమంది కష్టాన్ని ఉచితంగా దోచుకోవడం సబబు కాదు.. సినిమా రంగం ఎన్నో కష్టనష్టాలకోర్చి చిత్రాలు తీస్తోంది.. చాలా ఏళ్లుగా పైరసీ బాధించింది.. సినిమాను నమ్ముకుని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి.. పైరసీ కట్టడికి పోలీసులు ఎంతో శ్రమించారు.. గత సీపీ సీవీ ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ పైరసీ భూతాన్ని పట్టుకున్నారు.. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు-చిరంజీవి..
సుప్రీంకోర్టులో నేడు మరోసారి తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసు విచారణ.
విచారణ జరపనున్న జస్టిస్ నాగరత్న ధర్మాసనం
ఫోన్ టాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావుకు కల్పించిన మద్యంతర రక్షణను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
ఉపయోగించిన ఐ క్లౌడ్ సరియైన ఐడి, పాస్వర్డ్ ను దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని గత విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు ఆదేశించిన సుప్రీంకోర్టు..
ప్రస్తుతం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం.. మిగిలిన ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
_• పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం._
_• మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తాం.