రేవంత్ విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి మరణశాసనం రాస్తున్నారు…కేటీఆర్..

భోత్రా లాజిస్టిక్స్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లు బయటపెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపిక చేశారో రేవంత్ సమాధానం సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు..భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే ముఖ్యమంత్రి చీకటి ఒప్పందం చేసుకొని.. కావాలనే కృత్రిమ బొగ్గు కొరత, కరెంట్ సంక్షోభం సృష్టించి అదను చూసి కంపెనీని రంగంలోకి దింపారు. భోత్రా లాజిస్టిక్స్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి చేసుకున్న అన్ని రహస్య అగ్రిమెంట్లు బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన సదరు కంపెనీని ఎంపిక చేశారో రేవంత్ సమాధానం చెప్పాలి. మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. రేవంత్ విదేశీ బొగ్గు దిగుమతి పేరిట సింగరేణికి మరణశాసనం రాస్తున్నారు. కాంగ్రెస్-బీజేపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విదేశీ బొగ్గు దిగుమతుల విషయంలో ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు సింగరేణిలో G9 బొగ్గు లేదని అబద్ధాలు చెప్పడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. సింగరేణి సంస్థకు రూ. 60 వేల కోట్ల బాకీ చెల్లించకుండా సంస్థను కుప్పకూల్చే కుతంత్రం చేస్తున్నారని ఆరోపించారు. దేశీయ సంస్థలను పక్కనపెట్టి కమీషన్ల కోసమే విదేశీ బొగ్గు కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల ముసుగులో ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగం సిద్ధం చేశారన్న కేటీఆర్ అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. సింగరేణిని బలహీనపరిచి.. విదేశీ బొగ్గు దిగుమతికి జరుగుతున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరిస్తూ సుదీర్ఘ అంశాలను లేఖలో ప్రస్తావించారు…కమీషన్ల ముసుగులో ప్రతి టన్నుపై రూ.1,500 చొప్పున ఏకంగా రూ.3,000 కోట్ల దోపిడీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగం సిద్ధం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు