శబరిమల యాత్రికుల సహాయనిధి కోసం సేకరించే విరాళాన్ని పెంచాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) యోచిస్తోంది. ఈ విరాళం మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ విరాళం పెంపునకు సంబంధించిన ప్రక్రియ అమలుకు బోర్డు నిర్ణయంతో పాటు న్యాయపరమైన అనుమతి కూడా అవసరం ఉంది. న్యాయపరమైన ఆమోదం అవసరం ఉన్నందున దేవస్వం బోర్డు కేరళ హైకోర్టును ఆశ్రయించనుంది. కోర్టు అనుమతి లభించిన తర్వాతే ఈ పెంపు అమల్లోకి రానుంది. శబరిమల భక్తులు దర్శనం కోసం వర్చువల్ క్యూ సేవలను బుక్ చేసుకునేందుకు ప్రస్తుతం రూ.5ను పిలిగ్రిమ్ రిలీఫ్ ఫండ్ కింద సేకరిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.10కి పెంచాలని తాజాగా జరిగిన మీటింగ్లో బోర్డు ప్రతిపాదించింది. ఈ మీటింగ్లో బోర్డు మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
ఇకపై ఉచిత శౌచాలయాలు.
శబరిమల సన్నిధానం, పంబ సహా వివిధ ప్రాంతాల్లో డబ్బులు చెల్లించి ఉపయోగిస్తున్న శౌచాలయాలు, స్నానాల గదులను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. కోర్టు అనుమతిస్తే, రానున్న మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఫలితంగా శబరిమల సన్నిధానం, పంబా, స్వామి అయ్యప్పన్ రోడ్డు, యాత్ర మార్గంలో ఉన్న ఇటువంటి సౌకర్యాలన్నింటినీ భక్తులు ఎటువంటి రుసుము చెల్లించకుండానే ఉపయోగించుకోవచ్చు..
శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. సన్నిధానం, పంప, స్వామి అయ్యప్పన్ రోడ్, సాంప్రదాయ మార్గాల్లో ఉండే మరుగుదొడ్లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఇంతకుముందు రుసుము చెల్లించి ఉపయోగించిన స్నానాల గదుల సేవలను ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నారు.
పరిసరాల పరిశుభ్రత లోపించడం, కొందరు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. దీనితో పాటు యాత్రికుల సహాయ నిధి కోసం సేకరించే విరాళాన్ని పెంచాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో సేకరిస్తున్న 5 రూపాయల మొత్తాన్ని పెంచనున్నారు.
ఈ పిలిగ్రిమ్ రిలీఫ్ ఫండ్ రుసుమును 10 రూపాయలకు పెంచడానికి హైకోర్టు అనుమతి కోరనున్నారు. అలాగే సన్నిధానంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేశారు. రాబోయే ప్రధాన తీర్థయాత్ర సీజన్ కోసం అన్ని శాఖల సమన్వయంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.