మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కు దూసుకెళ్లి అక్కడికక్కడే 12 మంది మృతి..

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.

ట్రక్కు దూసుకెళ్లి అక్కడికక్కడే 12 మంది మృతి..

గ్వాలియర్‌లోని చినూర్‌ రోడ్డులో ఘటన
అదుపుతప్పి షీతలా మాత ఆలయంలోకి దూసుకెళ్లిన ట్రక్కు..

ఆలయంలోని 12 మంది భక్తులు మృతి
మరో ఆరుగురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు..

పండగ పూట దేశంలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. రాత్రే కోల్కతాలోని దుర్గా మండపం వద్ద ప్రమాదం జరిగి 17 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. మరోచోట ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది. దైవ దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న భక్తుల మీదకు లారీ దూసుకువచ్చింది. దీంతో 12 మంది మృత్యువాత పడ్డారు. ఆ వివరాలు..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దసరా నవరాత్రి ఉత్సవాల వేళ అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శీతల మాత ఆలయం వద్దకు దర్శనం కోసం భారీగా చేరుకున్న భక్తులపైకి ధాన్యంతో వస్తున్న ఓ భారీ లారీ అతి వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ దుర్ఘటనతో ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది…

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ శీత్లామాత దేవాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు అదుపుతప్పి భక్తులపై దూసుకెళ్లింది. తొలుతు అత్యంత స్పీడుగా వచ్చిన ఈ ట్రక్కు గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది భక్తులు మృతి చెందగా మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.వివరాల్లోకి వెళ్తే చినోర్ వైపు నుంచి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆలయ సమయంలో అదుపుతప్పింది. శీత్లామాత ఆలయం సమీపంలో అదుపుతప్పిన ట్రక్కు బారికేడ్లు, ఆలయ ప్రధాన ద్వారం, గోడను ఢీకొట్టి భక్తులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు ట్రక్కు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యారు. 12 మంది భక్తులు మృతి చెందారు. అలాగే విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు సైతం తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. నవరాత్రుల సందర్భంగా ఆ మార్గంలో బారికేడ్లు, పోలీసు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ట్రక్కు ఎలా లోపలికి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..