నామినేషన్ల వేళ జరిగిన గొడవలు, భౌతిక దాడుల చేస్తున్నారు..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠాను స్వయంగా కలిసి ఫిర్యాదు చేసిన ys జగన్.

విజయవాడ: ఎస్‌ఈసీని కలిసిన మాజీ సీఎం జగన్‌..

రాష్ట్రవ్యాప్తంగా దాడులపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు…

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై ఫిర్యాదు
దాడుల ఘటనలపై ఆధారాలు అందజేసిన జగన్‌
అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించలేదన్న జగన్‌
హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని జగన్‌ ఆరోపణ
…

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠాను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అధికార టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో హింసకు పాల్పడుతున్నారని, వైసీపీ అభ్యర్థులు కనీసం నామినేషన్లు వేయకుండా రౌడీ మూకలతో అడ్డుకుంటున్నారని ఎస్ఈసీకి వివరించారు. ఈ సందర్భంగా నామినేషన్ల వేళ జరిగిన గొడవలు, భౌతిక దాడుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కమిషన్‌కు అందజేశారు..

తాము కోరిన అన్ని అంశాలపైనా ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సానుకూలంగా స్పందిస్తూ తల ఊపారని, ఆయన నిజంగా నిష్పాక్షికంగా, నిజాయితీగా ఉంటే ఈ డిమాండ్లన్నింటినీ తక్షణమే అమలు చేయాలని జగన్ స్పష్టం చేశారు. స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఏ ఒక్కరి కోసమో పనిచేయకూడదని హితవు పలికారు. రాష్ట్రంలో పోలీసులు చట్టాన్ని కాపాడటం మాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేవలం వాచ్‌మెన్లుగా మారిపోయారని ఆరోపించారు. తమ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించామని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు.