ట్రంప్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటి నుంచి 76 ఇంధన వనరులపై రష్యా దాడులు: జెలెన్స్కీ

ఇంధన దాడులకు విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన వారం తర్వాత, తమ ఇంధన, చమురు, గ్యాస్ రంగాలపై రష్యా 76 దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. రాత్రికి రాత్రే 4 ప్రాంతాల్లోని విద్యుత్ సబ్స్టేషన్లపై జరిగిన దాడులతో 10 వేల మందికి పైగా విద్యుత్ లేకుండా పోయిందన్నారు. రష్యాపై ఆంక్షల ఎత్తివేతపై ట్రంప్ నిర్ణయాన్ని జెలెన్స్కీ విమర్శించారు….అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో అమెరికా పౌరులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వచ్చిన ఈ ప్రకటన అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.