వచ్చేది మా ప్రభుత్వమే, తొలి ఆర్నెళ్లు నేనే హోంమంత్రి: గుంటూరులో వైసీపీ నామినేషన్ సందర్భంగా అంబటి
వచ్చేది తమ ప్రభుత్వమేనని, తొలి ఆర్నెళ్లు తానే హోంమంత్రిగా ఉంటానని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న అందరు పోలీసులు మంచోళ్లేనని, అయితే ఒక్కరు మాత్రం కాదని ఆయన పేర్కొనడం స్థానికంగా చర్చనీయాంశమైంది.