అర్హులైన విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలకు అవకాశం కల్పిస్తాం: ఇంటర్ బోర్డు..

అర్హులైన విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలకు అవకాశం కల్పిస్తాం: ఇంటర్ బోర్డు

రాష్ట్రంలోని అర్హులైన ఇంటర్ విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. కళాశాలల అనుబంధ గుర్తింపు సమస్యల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందవద్దని తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు పాటించిన కాలేజీలకే గుర్తింపు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు.

నిబంధనల్లో లోపాలున్న కళాశాలలకు వాటిని సరిదిద్దుకునేందుకు నిర్దేశిత గడువు ఇచ్చినట్లు తెలిపారు. అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులను పలుమార్లు అప్రమత్తం చేసినట్లు గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని బోర్డు స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించనుంది. కళాశాలల గుర్తింపు, నిబంధనల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..