ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం
మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు 1038 నామినేషన్లు
టీడీపీ నుంచి 283, YCP నుంచి 319 నామినేషన్లు దాఖలు..
జనసేన నుంచి 91, బీజేపీ నుంచి 21 నామినేషన్లు దాఖలు..
కాంగ్రెస్ నుంచి 81 నామినేషన్లు దాఖలు
స్వతంత్ర అభ్యర్థులుగా 175 మంది నామినేషన్లు
మొత్తం 1038 చైర్పర్సన్,వార్డులకు 3020 నామినేషన్లు..
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువును అదనంగా ఒకరోజు పెంచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్ను తిరస్కరించింది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ దాఖలు గడువు ముగిసిందని, ఒకరోజు గడువు పెంచాలని ఆదేశిస్తే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లే అవుతుందని పేర్కొంది. కౌంటర్లు దాఖలు చేయాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రధాన అప్పీల్పై విచారణను 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య, జస్టిస్ చింతలపూడి పురుషోత్తమ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది.