ఇది ఏలినో ప్రభావంతో వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు…
*ఆంధ్ర, తెలంగాణ సీఎంలు పేరుకే వేరు.. తెలంగాణ లో డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదే..*
*బిఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తు ఉండదు..*
*బిజెపి ప్రచారాన్ని నమ్మవద్దు..*
*సూర్యాపేట జిల్లా…* నేరేడుచర్ల మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సెంటర్ ను ప్రారంభించిన brs పార్టీ…. ముఖ్య అతిథిగా హాజరై నమోదు ప్రక్రియపై కార్యకర్తలకు అవగాహన కల్పించిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి… పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు.. సర్పంచులు,. మాజీ ప్రజా ప్రతినిధులు… బిఆర్ఎస్ శ్రేణులు.. పట్టభద్రులు…
*ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ*
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు… ఆంధ్రాలో నీరు పుష్కలంగా పారుతుంటే తెలంగాణలో నీటిని కరువు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది…
క్రాఫ్ హాలిడే ప్రకటించమంటూ ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి,, తెలంగాణ రైతులు ఏం చేయాలో తెలపాలని ప్రశ్నించారు….
ఎక్కడ చూసినా మంత్రులు దోచుకోవడం దాచుకోవడం తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు…
ఎవరైతే ప్రశ్నిస్తారో వారిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ…
కేసీఆర్ గతంలో చెప్పినట్లుగానే ప్రస్తుతం కాంగ్రెస్ పాలన నడుస్తోంది… కత్తి ఆంధ్రుడిది పొడిచేది మాత్రం మనోడే అన్న సామెతను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిజం చేసిందని అన్నారు…… తెలంగాణ పంటలను ఎండబెడుతూ ఆంధ్రకి అప్పారంగా నీటి దానం చేస్తూ గురు భక్తిని చాటుకున్నారని అన్నారు…. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడం దాదాపు ఖాయమైపోయిందని సర్వేలు పూర్తిగా తెలుపుతున్నాయని అన్నారు…. నిరుద్యోగుల్ని మోసం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు….
కొంతమంది నాయకులు బిజెపితో పొత్తు ఉంటుందని అపోహల్లో ఉన్నారని,, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎప్పుడో చెప్పారని ఎవరితో పొత్తు ఉండదు అని .. ఒంటరిగానే ఏ ఎన్నికల్లో అయినా బరిలో దిగుతామని తెలిపినట్లుగా కార్యకర్తలకు వివరించారు..