మందు కొంటే మటన్ ఫ్రీ
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో ఉన్న ఓ వైన్స్ షాపు ముందు మందు కొంటే మటన్ ఉచితం అంటూ వెలసిన బ్యానర్..
హైదరాబాద్ శివార్లలోని (అమీన్‌పూర్ / బీరంగూడ) ఒక ప్రముఖ వైన్ మార్ట్ (“హౌస్ ఆఫ్ స్పిరిట్స్”) దసరా రోజు మధ్యాహ్నం ఒక గంట పాటు (మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు) మందు కొనుగోలు చేసిన వారికి మటన్ ముక్కలు ఉచితం అంటూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఈ వినూత్నమైన మార్కెటింగ్ స్టంట్ మందుబాబులను ఎంతగానో ఆకర్షించడమే కాకుండా, నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తింది.
సాధారణంగా ఎన్నికల సమయంలో లేదా పండుగల వేళల్లో స్థానిక నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి ఇటువంటి ఆఫర్లు ఇస్తుంటారని వార్తలు వస్తుంటాయి గానీ, ఒక వైన్ షాప్ యజమాని స్వయంగా ఇలాంటి బోర్డు పెట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..