తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు..

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు..

5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12జిల్లాలకు ఎల్లోఅలర్ట్.

పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం..

నాగపట్నంలో భారీ వర్షాలు.

కోయంబత్తూరు, దిండుక్కల్..

రామనాథపురం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.

పుదుచ్చేరి కారైకల్‌లో భారీ వర్షాలు.

కారైకల్‌లో విద్యాసంస్థలకు సెలవు..

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు(Heavy rains) జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. వర్షాల కారణంగా ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు దెబ్బతిని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఊటీ, కొడైకెనాల్‌(,Kodaikanal) వంటి పర్యాటక ప్రాంతాలను మూసివేసి వేశారు. పర్యాటకులు రావొద్దని అధికారులు సూచించారు..సముద్రంలో అలజడి కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, కళ్లకుర్చిలో అత్యధికంగా 17 సెం.మీ. వర్షం కురిసింది. పెరంబలూరులో 15 సె.మీ. ధర్మపురిలో 14 సెం.మీ. వర్షం కురిసింది. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని అధికారులు సూచించారు…