తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే నేను రాజీనామా చేస్తా..బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే నేను రాజీనామా చేస్తా…
అది అయ్యేది కాదు, పొయ్యేది కాదు..- బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై దూకుడు పెంచిన నేపథ్యంలో, బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రముఖ టీవీ ఛానల్ చర్చా వేదికలో పాల్గొన్న సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ ఈ సంచలన సవాల్ విసిరారు…”తెలంగాణ ప్రభుత్వం తుమ్మిడిహెట్టిపై దూకుడు పెంచిన తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబెట్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ‘తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అనేది అయ్యేది కాదు.. పొయ్యేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తి హడావుడి చేయడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఒకవేళ ధైర్యముంటే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చూపించాలి.. శంకుస్థాపన చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తా’ అని పైడి రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
Also Read – పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం : ఏసీపీ మాధవి
ప్రభుత్వం చేస్తోన్న ఉమ్మడి చర్చలు కేవలం రాజకీయ ప్రచారం కోసమేనని.. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆచరణాత్మక స్పష్టత లేదని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రతో చర్చల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఒకవైపు ప్రభుత్వం మహారాష్ట్రతో సంప్రదింపులను వేగవంతం చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజీనామా సవాల్ విసరడంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.”
ఇటీవల..
తెలంగాణలో సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలను పరిష్కరించి, నిర్మాణానికి మార్గం సుగమం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిపై తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, పరిహారం, ఇతర సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు…