పంజాబ్‌లో మళ్లీ పొత్తు ,,బీజేపీతో కలిసి పంజాబ్ అభివృద్ధికి కృషి చేస్తాం..అకాలీదళ్కే పెద్దన్న హోదా..!
బీజేపీ కార్యాలయంలో అమిత్ షా, నితిన్ నబీన్లతో చేతులు కలిపిన బాదల్ తదితరులు ..పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి
అకాలీదళ్కే పెద్దన్న హోదా.. సీఎం పదవీ ఆ పార్టీకే..
కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన
హిందూ-సిక్కు సోదరభావానికి కూటమి ప్రతీక అని వెల్లడి..
బీజేపీతో కలిసి పంజాబ్ అభివృద్ధికి కృషి చేస్తాం..
అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టికణ..
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ, శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) మళ్లీ చేతులు కలిపాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఎన్డీయేలో అకాలీదళ్ తిరిగి చేరినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
తమ కూటమిలో అకాలీదళ్దే పెద్దన్న పాత్ర అని, ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ మేరకు పొత్తు ప్రకటన చేశారు.
అకాలీదళ్‌కు పెద్దన్న హోదా
అకాలీదళ్‌ను బీజేపీకి ‘అత్యంత పురాతన మిత్రపక్షం’గా అమిత్ షా అభివర్ణించారు. ఇరు పార్టీల మధ్య సంబంధం అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీల కాలం నాటిదని గుర్తుచేశారు. దేశమంతా పవిత్ర గురుపర్వ్ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో అకాలీదళ్ మరోసారి ఎన్డీయేలోకి తిరిగి రావడం భాగస్వామ్య పక్షాలకు ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీ యే పెద్దన్న పాత్ర పోషిస్తుందని తేల్చిచెప్పారు. బడా భాయ్ హీ సీఎం హోతా హై(పెద్దన్నే ముఖ్యమంత్రి అవుతారు) అని వ్యాఖ్యానించారు.
పంజాబ్ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి అకాలీదళ్కే దక్కుతుందని వెల్లడించారు. అయితే, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్డీయేలోకి మళ్లీ అకాలీదళ్ రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు పార్టీల మధ్య బంధం రాజకీయాలకు అతీతమైనదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ పరిణామంపై హర్షం వ్యక్తంచేశారని తెలిపారు…
2029 నాటికి డ్రగ్స్ రహిత పంజాబ్
పంజాబ్‌లో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే కూటమి ప్రధాన లక్ష్యాల్లో ఒకటని అమిత్ షా ప్రకటించారు. 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ ఆశయమని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తోపాటు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు..