నేటి పంచాంగం.. రాశి ఫలాలు..

తేది : 10, ఏప్రిల్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 23 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 14 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 31 ని॥ నుంచి
మర్నాడు ఉదయం 6 గం॥ 52 ని॥ వరకు)
యోగము : సుకర్మము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 36 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 50 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 35 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 11 గం॥ 49 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 29 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 56 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 4 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : కర్కాటకము

మేషం?
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులతో చర్చలు ఫలించవు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
అదృష్ట సంఖ్య 6

వృషభం?
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
అదృష్ట సంఖ్య 5

మిథునం?
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలసి రావు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
అదృష్ట సంఖ్య 3

కర్కాటకం?
బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సమర్థించుకుంటారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి.
అదృష్ట సంఖ్య 7

సింహం?
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. బంధువర్గం తో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కొన్ని పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
అదృష్ట సంఖ్య 5

కన్య?
నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
అదృష్ట సంఖ్య 3

తుల⚖️
స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి చిన్ననాటి మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి.
అదృష్ట సంఖ్య 6

వృశ్చికము?
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో అకారణ వివాదాలు కలుగుతాయి దైవచింతన పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.
అదృష్ట సంఖ్య
అదృష్ట సంఖ్య 7

ధనస్సు?
వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆలయాలు సందర్శించుకుంటారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ పెద్దలు ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
అదృష్ట సంఖ్య 4

మకరం?
సంతాన సౌకర్యాల విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
అదృష్ట సంఖ్య 4

కుంభం⚱️
సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
అదృష్ట సంఖ్య 2

మీనం?
నూతన ప్రయత్నాలు కలిసి రావు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఉంటాయి.
అదృష్ట సంఖ్య 9