ఒంటిగంటకు భేటీకానున్న కేంద్ర కేబినెట్..

ఈ నెల 30 నుండి పార్లమెంట్ సమావేశాలు..!

_30వ తేదీ నుంచి లోక్ స‌భ‌, డిసెంబర్ 2వ తేదీ నుంచి రాజ్య‌స‌భ‌ సమావేశాలు_

_డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలు_

అత్యవసర బిల్లుల ఆమోదం కోసం ప్రత్యేకమైన పార్లమెంట్ సమావేశాలు..!!.

_సమావేశాల తేదీలను ప్రకటించిన పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌న్ రిజిజు.

మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీకానున్న కేంద్ర కేబినెట్
మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీకానుంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ఆమోదం తెలపనున్నట్లు సమాచారం..

అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా నవంబర్ 30వ తేదీన లోక్‌సభను, డిసెంబర్ 2వ తేదీన రాజ్యసభను తిరిగి సమావేశపరచాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక సమావేశాలు డిసెంబర్ 3వ తేదీతో ముగిసే అవకాశం ఉంది…

పార్లమెంటు సమావేశాలపై బులెటిన్ విడుదల చేసిన ఉభయసభల సచివాలయాలు.

పార్లమెంటు సమావేశాలపై ఉభయసభల సచివాలయాలు బులెటిన్ విడుదల చేశాయి. ఆగస్టులో వాయిదాపడిన సమావేశాల కొనసాగింపు అని బులెటిన్ విడుదల చేశాయి. లోక్‌సభ, రాజ్యసభలు రాత్రి వేర్వేరుగా బులెటిన్ విడుదల చేశాయి. ఉభయసభలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదాపడ్డాయి. అప్పటి నుంచి పార్లమెంటును ప్రోరోగ్ చేయని రాష్ట్రపతి తెలిపారు. సభ కార్యకలాపాల బిజినెస్ బులెటిన్ను లోక్‌సభ విడుదల చేసింది…