పంటలు వేయొద్దు అని చెప్పిన ఏకైక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్..

పంటలు వేయొద్దు అని చెప్పిన ఏకైక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం..

గతంలో 1999 నుంచి 2004 వరకు భయంకరమైన కరువు ఉన్నా ఎవరు పంటలు వేయకండి అని చెప్పలేదు

కానీ ఈ ప్రభుత్వం ఒక్క కరువుకే ప్రజలను ఇంత ఆగం చేస్తున్నారు

ఇప్పటికైనా నాణ్యమైన కరెంట్ ఇవ్వండి..– బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్…

కాళేశ్వరం ప్రాజెక్టు ఉండగా ఈ ప్రాంతానికి కరువు రాదని ఎప్పుడో చెప్పాను

కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే క్రమంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని బోనులో నిలబెట్టాడు

ఎండాకాలంలో కూడా నీళ్లు లేకపోతే ప్రాణహిత నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని తెలిసి కూడా రేవంత్ సర్కార్ రైతులకు నీళ్లు ఇవ్వలేదు

నాకు 90 సీట్లు వస్తాయి, కోటి ఓట్లు వస్తాయని రేవంత్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నాడు

కాంగ్రెస్ పార్టీ ఇంకో 15 ఏండ్లు అధికారంలోకి రాదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారూ అన్నారు…శాస్త్రవేత్తలు హెచ్చరించిన ఎల్ నినో కరువు పరిస్థితులను ఎదుర్కోలేని సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల తెలంగాణ ఎడారిగా మారనుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
ఒక్క సీజన్ కి కరువు వస్తేనే ప్రభుత్వం చేతులెత్తేసిందని,పండిన కాస్త పంట కూడా కొనుగోలు చేయలేక పోతున్నారు అని అన్నారు. రేవంత్ రెడ్డి 90 సీట్లు వస్తాయి, కోటి ఓట్లు వస్తాయి అని భ్రమల్లో బ్రతుకుతున్నాడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయనకు కూడా తెలుసన్నారు.రేవంత్ రెడ్డి వల్ల మరో 15 ఏళ్లు అధికారంలోకి రామని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది కానీ ఏ సమస్యకు సరైన పరిష్కారం అందించలేక పోతుందని అన్నారు.
25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ఇంత భయంకరమైన కరువును ఎప్పుడూ చూడలేదనీ, కరువు వస్తుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు కానీ ప్రభుత్వం మేల్కోకపోవడం దారుణం అన్నారు.వర్షాకాలంలో పండిన పంట కూడా కొనే దిక్కులేదని , ఐకెపి సెంటర్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.500 రూపాయలు అదనంగా ఇస్తాను ఒక కిలో కూడా బయట అమ్మకండి నేనే కొంటా అని చెప్పారు కానీ కొనడం లేదని,
మొక్కజొన్నలు కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడితే 1800 రూపాయలకే అమ్ముకున్నారు. చివరికి రైతులు తిరుగుబాటు చేస్తే కొన్నారు..ఇప్పుడు పండిన ధాన్యం కూడా మిల్లర్లు కొంటున్నారు తప్ప ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని,వచ్చే ఎండాకాలం పంటలు ఉండేటట్టు కనిపించడం లేదు,
పంటలు పండక పోతే బట్టల షాపులు, కిరాణా షాపులు నడవవు. స్కూలు ఫీజులు సరిగా చెల్లించలేరు. పెళ్లిళ్లు కూడా వాయిదా చేసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. 90 సీట్లు వస్తాయని సీఎం అంటుంటే కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ గెలవదు అని డంకా భజయించి చెప్తున్నారని అన్నారు. రాజ్యాంగం పట్టుకుని పర్యటన చేసే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ఏమిటో ఆయనకే తెలియాలన్నారు.