రైతన్నలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం…లోన్స్ తీసుకోవచ్చు సంవత్సరం వడ్డీ కూడా తక్కువే..!
రైతన్నలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. అలాంటి ఓ పథకమే సాన్ క్రెడిట్ కార్డ్.. దీని గురించి ఇప్పటికీ చాలా మంది రైతులకు తెలియదు. ఈ పథకం కింద రైతులు చాలా తక్కువ వడ్డీకే ఆర్థిక సహాయం పొందవచ్చు..
వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందు లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) కూడా ఒకటి. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, నీటిపారుదల వంటి అవసరాల కోసం ఈ పథకం ద్వారా లోన్స్ పొందవచ్చు. అంతేకాకుండా పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలకు కూడా ఈ పథకం ద్వారా మీరు లోన్స్ తీసుకోవచ్చు…చాలామంది KCCని ఏటీఎం కార్డ్ లాంటిది అనుకుంటారు. కానీ ఇది రివాల్వింగ్ క్రెడిట్ ఫెసిలిటీ. అంటే, బ్యాంకు ముందుగా ఒక క్రెడిట్ లిమిట్ మంజూరు చేస్తుంది. రైతుకు అవసరమైనప్పుడు ఆ లిమిట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు, పంట అమ్మాక తిరిగి చెల్లించవచ్చు. ప్రతి పంట సీజన్‌కు కొత్తగా లోన్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్ సౌకర్యం ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతుంది, మరియు బ్యాంకు ప్రతి సంవత్సరం రుణ చెల్లింపులు, సాగు వివరాలు పరిశీలించి, అవసరమైతే లిమిట్‌ను పెంచవచ్చు.
4శాతం వడ్డీ..!
ప్రస్తుతం రూ. 3 లక్షల వరకు ఉన్న స్వల్పకాలిక పంట రుణాలకు సాధారణంగా 7శాతం వార్షిక వడ్డీ ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తుంది. అంతేకాకుండా, రైతు రుణాన్ని గడువులోపు పూర్తిగా చెల్లిస్తే ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది. ఈ రెండు ప్రయోజనాలు వర్తిస్తే, రైతు చెల్లించే ప్రభావిత వడ్డీ సుమారు 4% వరకు తగ్గుతుంది. కాబట్టి, మొదటి రోజు నుంచే అందరికీ 4% వడ్డీ వర్తిస్తుందని అనుకోవద్దు; సకాలంలో రుణం చెల్లించడం చాలా ముఖ్యం.