భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు…ఈ సమావేశంలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మహమ్మద్ షమీ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారన్న ఊహాగానాలు దేశ రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి.
యూపీ ఎన్నికలపై ఫోకస్..
అయితే, వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, షమీ తన సొంత ప్రాంతమైన యూపీలోని అమ్రోహా నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. షమీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, బీజేపీ మైనారిటీ మోర్చాలో ఆయనకు కీలక పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక ఇటీవల మరో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీ ఓబీసీ మోర్చాలో నియమితులైన వారం రోజుల్లోనే, షమీ బీజేపీ అగ్రనేతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కని నేపథ్యంలో షమీ ఈ భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. నితిన్ నబీన్‌తో జరిగిన ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరిగిందనే దానిపై ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో సస్పెన్స్ నెలకొంది.