ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం అమిత్ షా, రాజ్‌నాథ్‌, నితిన్ నబీన్, నేతలు హాజరు పార్లమెంట్ సమావేశాలు, డీలిమిటేషన్‌ బిల్లుపై చర్చ…!

ఢిల్లీ: ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం
అమిత్ షా, రాజ్‌నాథ్‌, నితిన్ నబీన్, నేతలు హాజరు
పార్లమెంట్ సమావేశాలు, డీలిమిటేషన్‌ బిల్లుపై చర్చ…

రేపటి (నవంబర్ 30, 2026) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మరియు డీలిమిటేషన్ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ కీలక సమావేశం నిర్వహించింది..

లోక్‌‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించడంతో అన్ని పార్టీల్లోనూ కొత్త లెక్కలు మొదలయ్యాయి. లోక్‌‌సభ బలం 850కి, రాష్ట్రాల అసెంబ్లీల గరిష్ట సీట్ల సంఖ్య650కి చేరేలా బిల్లును రూపొందించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల హద్దులు మార్చడంతోపాటు 2029 ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నది. జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా మార్పులు చేసింది.

సీట్ల పెంపు.. మహిళా కోటా..

రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల వాటాను 2051 వరకు స్థంభింపజేస్తూనే ఈ పెంపు చేపట్టనున్నారు. దీంతో లోక్‌సభ గరిష్ఠ బలం 850కి చేరుతుంది. ఇందులో రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 స్థానాలు ఉంటాయి. రాష్ట్రాల అసెంబ్లీల గరిష్ఠ సభ్యుల సంఖ్య కూడా 650 వరకు పెరగనుంది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాల హద్దులను పునర్విభజించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియతోపాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని కేంద్రం భావిస్తున్నది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందకపోవడంతో తాజా సవరణలతో మళ్లీ తీసుకొస్తున్నది. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు విముక్తి పొందిన తర్వాత వాటి పునర్విభజన బాధ్యతలను ఎన్నికల కమిషన్‌కు అప్పగించేలా బిల్లులోని సెక్షన్ 3(4)లో వెసులుబాటు కల్పించారు.