రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో కూడా కులం ఉంది..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.!.

భారత్ లో కుల వివక్ష ఇప్పటికీ బలంగా ఉందని.. దళితులు, ఆదివాసీలు, మహిళలపై అసమాత్వం ఉన్న మాట వాస్తవం అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు..

*మన దేశంలో కుల వ్యవస్థ బలంగా ఉంది-రాహుల్‌*

_• అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ కనిపించదు..

_• కులగణన ద్వారా నష్టం జరగకుండా చూడవచ్చు..

*• అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉంది-రాహుల్‌గాంధీ.

*• రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో కూడా కులం ఉంది.

*• ఆత్మవిశ్వాసాన్ని కుల వ్యవస్థ దెబ్బతీస్తుంది-రాహుల్*

రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.

రాష్ట్రంలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనను ఎక్స్రేతో పోల్చుతానని ఆయన అభివర్ణించారు. ఈ క్యాస్ట్ సెన్సెస్ ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలిపారు. బోయిన్పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు..కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంటరానితనం భారత్‌లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్న ఆయన దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగవచ్చని వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేదానిపై సామాన్యులే నిర్ణయించాలని ఆయన పేర్కొన్నారు.

“దేశంలో కులవ్యవస్థ ఉందని ఒప్పుకొందాం. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? ఈ కులగణన ద్వారా ఓబీసీలు, దళితులు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుంది.
ఈ గణన తర్వాత ఎవరి వద్ద ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందాం. జనాభా తగ్గట్లు రిజర్వేషన్లు పెంచుతాం, కులగణన చేస్తామని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పాను అన్నారు..