రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ దుర్గారావు..! సస్పెన్షన్.

*..

*_గుడివాడ టౌన్ సిఐగా..లంచం వసూళ్ల కేసులో ఐజీ ఆదేశాలు_*

_రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ వి. దుర్గారావును సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు._

_గుడివాడ రెండో పట్టణ సీఐగా దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్న ప్పుడు 2022లో భూ వివాదంపై ఫిర్యాదు అందగా, రెండు వర్గాలకు సంబంధించి రూ.30 లక్షలకు వివాదాన్ని పరిష్కరించారు._

ఈ సమయంలో సొమ్ము ఇచ్చినవారికి అనుకూలంగా ఉండి ఫిర్యాదుదారు నుంచి కొన్ని డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని, వ్యతిరేక వర్గానికి ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లు వెనక్కి ఇప్పించాలని ఫిర్యాదుదారు సీఐని కోరగా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం, దర్యాప్తులో నేరం తేలడంతో సీఐ పై క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్కు సిఫార్స్ చేశారని ఐజీ తెలిపారు.