ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతి రేకంగా వెలిసిన కరపత్రాలు జిల్లాలో కలకలం రేపుతుంది..
ఇటీవల ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన అన్నదమ్ములను గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి ఐక్యవేదిక ములుగు జిల్లా పేరిట వాజేడు మండలం చెరుకూరు గ్రామ సమీపం లో రోడ్డుపై వెలిశాయి.
ఈ కరపత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి విడిచి వెళ్లినట్లు తెలుస్తుంది మావోయిస్టుల స్వార్థప్రయోజనాల కోసం అమాయక పేద ప్రజలు బలైపోతున్నారని, మావో యిస్టులకు ఆదివాసుల ప్రాణాలు అంటే లెక్క లేదా?అని ప్రశ్నించారు.
అమాయక ఆదివాసీ, గిరిజన, పేద ప్రజల ప్రాణాలు తీయడమే నీ ఉద్యమమా? అని ఆది వాసులను అడవికి దూరం చేయాలని చూస్తున్నారని కరపత్రాలలో పేర్కొన్నారు